Champions Trophy 2025: రూ. 315తో మ్యాచ్ చూడొచ్చు: ఛాంపియన్స్ ట్రోఫీకి టికెట్ ధరలు ఇవే

క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మొత్తం 8 జట్లు టైటిల్ కోసం తలపడే ఈ సమరం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడల్ లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, దుబాయ్ ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరగబోయే మ్యాచ్ లకు పాకిస్థాన్ క్రికెట్ టికెట్ ధరలను ప్రకటించింది. 

పాకిస్థాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 1000 PKR గా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది  కేవలం రూ. 315 కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అభిమానులకు టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పాక్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లకు కనీస టిక్కెట్ ధరను 1000 PKR(భారత కరెన్సీలో రూ. 315) గా నిర్ణయించింది. రావల్పిండిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ కు మాత్రం టిక్కెట్ ధరలు 2000 PKR (భారత కరెన్సీలో రూ. 620) నుండి ప్రారంభమవుతాయి.

ALSO READ | Team India: కొత్త బ్యాటింగ్ కోచ్ వేటలో బీసీసీఐ.. రేస్‌లో ఇంగ్లాండ్ మాజీ స్టార్ క్రికెటర్

సెమీ-ఫైనల్ టిక్కెట్లు 2500 పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ.776) గా ప్రకటించారు. ప్రీమియం ద్వారా చూడాలనుకుంటే  గ్రూప్-స్టేజ్ గేమ్‌లకు PKR 12000 (భారత కరెన్సీలో రూ. 3726), సెమీ-ఫైనల్‌లకు PKR 25000 (భారత కరెన్సీలో రూ. 7764)కి VVIP టిక్కెట్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ భారత్ సెమీస్‌కు అర్హత సాధించి ఫైనల్స్‌కు చేరుకుంటే, సెమీ-ఫైనల్ 1, ఫైనల్ రెండూ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆతిథ్య పాకిస్థాన్‌తో సహా 8 జట్లు ఆడనున్నాయి. పాకిస్థాన్, భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ రెండు గ్రూప్ లుగా మ్యాచ్ లు ఆడనున్నాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)

ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)

ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా  (నేషనల్ స్టేడియం, కరాచీ)

ఫిబ్రవరి 22:  ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)

ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)

ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)

ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)

ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)

ఫిబ్రవరి 27: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)

ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)

మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్  (నేషనల్ స్టేడియం, కరాచీ)

మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)

మార్చి 4: సెమీ-ఫైనల్ 1 (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)

మార్చి 5:సెమీ-ఫైనల్ 2 (గడాఫీ స్టేడియం, లాహోర్)

మార్చి 9: ఫైనల్ (గడాఫీ స్టేడియం, లాహోర్)