పాక్ జట్టు నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్, ఇమాద్ వాసిమ్‌లు మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరూ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అంతర్జాతీయ లీగ్ ల్లో అడగొడుతున్నారు. దీంతో మళ్ళీ పాక్ జట్టుకు ఆడాలని తమ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ మాజీ క్రికెటర్లు పాక్ జట్టులో చోటు సంపాదించారు. ఏప్రిల్ 18న రావల్పిండిలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టు ఎంపిక చేసిన 17 మంది ప్రాబబుల్స్ లో అమీర్, ఇమాద్ చోటు దక్కించుకున్నారు.
17 మంది స్క్వాడ్ లో ఐదుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లతో పాటు..ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తొలిసారి పాక్ టీ20 జట్టులో స్థానం దక్కింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో సత్తా చాటిన వారికి అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం ఇచ్చారు. ఉస్మాన్ ఖాన్ రెండు సెంచరీలతో మొత్తం 430 పరుగులలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.కరాచీ కింగ్స్ తరఫున ఇర్ఫాన్ ఖాన్ 9 మ్యాచ్‌లలో 140.16 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ అబ్రార్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున 10 మ్యాచ్‌లలో 19.56 సగటుతో 16 వికెట్లను పడగొట్టాడు.
31 ఏళ్ల అమీర్ పీసీబీతో చర్చలు జరిపిన తర్వాత తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై యు-టర్న్ తీసుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2019లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లీగ్ ల్లో అదరగొడుతున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం 2023 ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు.
న్యూజిలాండ్‌తో తలపడే పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షాహమా అఫ్రిదీ, యుఎస్ , ఉస్మాన్ ఖాన్ మరియు జమాన్ ఖాన్.
Mohammad Amir and Imad Wasim return to Pakistan squad, Usman Khan gets maiden national call-up
— Cricket Pakistan (@cricketpakcompk) April 9, 2024
Read More: https://t.co/jhnu4u4ZYk#PakistanCricket #PAKvNZ pic.twitter.com/eTQYy2NP7i