PAK vs BAN: పాక్ అభిమానులకు భారీ షాక్.. ప్రేక్షకులు లేకుండానే రెండో టెస్టు

PAK vs BAN: పాక్ అభిమానులకు భారీ షాక్.. ప్రేక్షకులు లేకుండానే రెండో టెస్టు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) కఠిన నిర్ణయం తీసుకుంది. కరాచీ స్టేడియం వేదికగా ఆతిథ్య పాకిస్తాన్- బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన రెండో టెస్టును ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు వారి అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్టును పంచుకుంది.

వచ్చే ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న వేదికల్లో ఒకటైన కరాచీ నేషనల్ స్టేడియంలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. 

"ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాల్లో భాగంగా నేషనల్ బ్యాంక్ స్టేడియం(కరాచీ)లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 3 వరకు పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టెస్టును ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించాం. అభిమానుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తక్షణమే టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేశాం. ఇప్పటికే టిక్కెట్లు కొన్నవారికి డబ్బు తిరిగి చెల్లిస్తాం..అభిమానులకు కలిగిన అసౌకర్యానికి మేమూ చింతిస్తున్నాము.. అర్థం చేసుకోగలరు.." అని పీసీబీ ప్రకటన చేసింది. 

పాక్ - బంగ్లా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 

  • మొదటి టెస్టు(ఆగస్టు 21- ఆగస్టు 25): రావల్పిండి క్రికెట్ స్టేడియం
  • రెండో టెస్టు(ఆగస్ట్ 30- సెప్టెంబర్ 03): కరాచీ నేషనల్ స్టేడియం