బాబర్ అజాం vs షహీన్ అఫ్రీది.. పాక్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షహీన్ అఫ్రీది విషయంలో చేసిన ఓక ట్వీట్ వివాదస్పదమవుతోంది. కెప్టెన్‌గా బాబర్ అజామ్‌కు మద్దతు ఇస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు నిన్న ప్రకటించగా.. ఈ స్టేట్ మెంట్ ను అఫ్రిది ఖండించారు. దీంతో ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డులో గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తేల్చుకునేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయలని భావిస్తోంది. 5 నెలలకే ఆఫ్రిదిని పరిమిత ఓవర్ల కెప్టెన్ నుంచి తొలగించడంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు షహీన్ సోమవారం (ఏప్రిల్ 1) పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కలవనున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా బాబర్‌ ఆజంను నిన్న (మార్చి 31) అధికారికంగా ప్రకటించారు. సెలక్షన్‌ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో బాబర్‌ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. బాబర్ అజామ్ స్థానంలో పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది కెప్టెన్ గా ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో తనకు తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మరోసారి బాబర్ ఆజాంకే కెప్టెన్సీని కట్టబెట్టారు.

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో పాక్ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో పాక్‌ క్రికెట్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విదేశీ కోచ్‌లను తప్పించడంతో పాటు కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజంను తప్పుకోవాలని సూచించి.. అతని స్థానంలో షహీన్ అఫ్రిదిని పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే షాహిన్‌ అఫ్రిది నాయకత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్.. టీ20 సిరీస్‌లోను 4-1తో కోల్పోయింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు మరోసారి బాబర్ అజామ్ నే నమ్ముకుని అతనికి కెప్టెన్సీ అప్పగించారు. 

ALSO READ :- IPL 2024: స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏమిటి? లక్షల్లో జరిమానా ఎందుకు..?