జీడిమెట్ల, వెలుగు : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్సెక్రటరీగా డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కృష్ణ ఆదిత్య బదిలీ కాగా ఆయన స్థానంలో గురువారం డా.జ్యోతి బుద్ధ ప్రకాశ్బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్యను సన్మానించి వీడ్కోలు పలికారు.