ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐకి పీసీబీ స్ట్రాంగ్ మెసేజ్

ఇస్లామాబాద్: వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి ఇటీవల జరగుతున్న పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ మేరకు "మంచి అనుభవాలు" ఆశించవద్దని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత్‌ను హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వస్తున్న వాస్తున్న వార్తల ప్రకారం 2025 ప్రారంభంలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు పాక్ లో పర్యటించాల్సి ఉంది. కానీ భారత్ తెలుపుతున్న అభ్యంతరాలతో నఖ్వీ నిరాశను వ్యక్తం చేశారు. "ఇటీవలి సంవత్సరాలలో, పాకిస్తాన్ అనేక మంచి ఏర్పాట్లను చేసింది. అయినప్పటికీ, మేము ఎల్లప్పుడూ అలా చేయమని మేము ఆశిస్తున్నాం" అని అంతర్గత మంత్రిగా కూడా పనిచేస్తున్న నఖ్వీ లాహోర్‌లో అన్నారు.

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తు్న్నాయి. అయితే మరో ఏడు నెలల సమయం ఉండటంతో.. దౌత్యపరమైన చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.

ALSO READ : BGT 2024-25: భారత్‌కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న రోహిత్

2008లో చివరి సారిగా పాకిస్తాన్ దేశంలో టీమిండియా ఆసియా కప్ లో పాల్గొన్నది. ఆ తర్వాత నుంచి అంటే.. ఈ 14 ఏళ్లల్లో ఎప్పుడూ పాక్ వెళ్లలేదు టీమిండియా. తటస్త వేదికపై మాత్రం పాకిస్తాన్ తో తలపడుతుంది. రాబోయే 2025 ఐసీసీ చాంపియన్ షిప్ లో.. ఇండియా, పాక్ మ్యాచ్ పాకిస్తాన్ వేదికగా డిసైడ్ చేశారు. ఆ దేశంలోనే మ్యాచ్ లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీమిండియా.. పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపించటం లేదంట..