Pakistan Cricket: మన దెబ్బకు ముగ్గురు సీనియర్లు ఔట్.. పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్‌

Pakistan Cricket: మన దెబ్బకు ముగ్గురు సీనియర్లు ఔట్.. పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్‌

ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ జట్టు విజయమన్నదే లేకుండా ముగించింది. గ్రూప్ స్టేజ్‌లో ఒక్క గెలుపూ లేదు. ఆడిన మూడింటిలో రెండింట ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అందునా టీమిండియా చేతిలో ఘోర ఓటమితో వారికి కనీస పరువు కూడా దక్క లేదు. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాక్.. అవమానకర రీతిలో టోర్నీ నుండి తప్పుకుంది. ఈ ఓటముల ఎఫెక్ట్ దాయాది జట్టులో అప్పుడే కనపడుతోంది.

జట్టును విజయాల బాటలో నడిపించలేకపోయిన ప్రస్తుతం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ(PCB) వేటు వేసింది. అతన్ని 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం చేసింది. టీ20 సారథిగా సల్మాన్ అఘా(Salman Agha)ను నియమించింది. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అఘా పాక్ జట్టును నడిపించనున్నాడు. షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. 

రిజ్వాన్, బాబర్, అఫ్రిది ఔట్.. 

పాకిస్తాన్ సెలెక్టర్లు టీ20 జట్టులో భారీ మార్పులు చేశారు. సీనియర్లు రిజ్వాన్, బాబర్ అజామ్‌లను తప్పించారు. పీసీబీ ప్రకటన ప్రకారం, రాబోయే రెండు ఐసీసీ టోర్నమెంట్లు(2025 సెప్టెంబర్‌లో టీ20 ఆసియా కప్,2026  ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌) దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టులో అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, మహ్మద్ అలీ రుపంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు. అలాగే, పాక్ వన్డే జట్టు నుంచి సీనియర్ పేసర్ షాహీన్ అఫ్రిదిని తొలగించారు.

Also Read : హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాను నిలబెట్టిన స్టీవ్ స్మిత్

పాకిస్తాన్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇది సుధీర్ఘ సిరీస్. ఇరు జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. మార్చి 16 నుండి ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.

పాకిస్తాన్ టీ20 జట్టు: హసన్ నవాజ్, ఒమైర్ యూసుఫ్, మహ్మద్ హరీస్ అబ్దుల్ సమద్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ నియాజీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), అబ్బాస్ అఫ్రిది, జహందాద్ ఖాన్, మహ్మద్ అలీ, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, సుఫియా ముఖ్, సుఫియా ముఖ్ ఖాన్.

పాకిస్తాన్ వన్డే జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, ఇర్ఫాన్ ముహమ్మద్, తాసెమ్ నియాజీ, తాసెమ్ నియాజీ, తాహిర్.

టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20 (మార్చి 16): క్రైస్ట్‌చర్చ్
  • రెండవ టీ20 (మార్చి 18): డునెడిన్
  • మూడవ టీ20 (మార్చి 21): ఆక్లాండ్
  • నాల్గవ టీ20 (మార్చి 23): మౌంట్ మౌంగనుయ్
  • ఐదవ టీ20 (మార్చి 26): వెల్లింగ్టన్‌

వన్డే  సిరీస్ షెడ్యూల్

  • మొదటి వన్డే (మార్చి 29): నేపియర్
  • రెండవ వన్డే (ఏప్రిల్ 2):  హామిల్టన్ 
  • మూడవ వన్డే (ఏప్రిల్ 5): మౌంట్ మౌంగనుయ్‌