కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ ఉల్ హక్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అతన్ని రెండోసారి నియమిస్తూ పీసీబీ సోమవారం నిర్ణయం తీసుకుంది. 2016–19 మధ్య కాలంలో ఇంజమామ్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు.
హరూన్ రషీద్ ప్లేస్‌లో అతను బాధ్యతలు చేపడతాడు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్ కోసం టీమ్‌ను ఎంపిక చేయడం ప్రస్తుతం ఇంజీ ముందున్న అతిపెద్ద బాధ్యత. 2019 వరల్డ్‌కప్ అప్పుడు కూడా ఇంజమామే టీమ్‌ను సెలెక్టర్ చేశాడు.
వరల్డ్‌కప్‌ను పక్కనబెడితే ఆసియా కప్, అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కూడా టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత అతనిపై ఉంది.