
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్ కు పాకిస్థాన్ క్రికెట్ లీగల్ నోటీసు పంపింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందాన్ని అతను ఉల్లంఘించాడని పీసీబీ ఆరోపించింది. త్వరలో జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్న ఈ సౌతాఫ్రికా పేసర్ ను ఇటీవలే ముంబై ఇండియన్స్ గాయపడిన లిజార్డ్ విలియమ్స్ స్థానంలో కొనుగోలు చేసింది. ఈ సారి పాకిస్థాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ రెండు ఒకేసారి జరగనున్నాయి. అయితే కార్బిన్ బాష్ మాత్రం ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంత తేలిగ్గా తీసుకోలేదు. అతనికి లీగల్ నోటీసులు పంపించి షాక్ ఇచ్చింది.
అతని ఏజెంట్ ద్వారా లీగల్ నోటీసు పంపబడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించమని ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్‌ను కోరింది. ఇచ్చిన గడువు లోపు అతని సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తోంది. కార్బిన్ బాష్ వచ్చే నెలలో జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టు తరపున ఆడనున్నాడు. ఈ 30 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ డైమండ్ కేటగిరీలో ఆ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి బోష్ ఐపీఎల్ లో మొదటి ఎవరూ కొనలేదు. ఐపీఎల్ కంటే ముందే అతను పాకిస్థాన్ లీగ్ కు మాత్రం ఎంపికయ్యాడు.
ఇటీవలే తన దేశానికే చెందిన ఫాస్ట్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి రీప్లేస్ గా ముంబై ఇండియన్స్ బోష్ ను ఎంపిక చేసింది. అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశాన్ని ఈ సౌతాఫ్రికా పేసర్ వదులుకోవాలనుకోలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ వద్దనుకుని ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. అయితే ఈ లోపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ ఒకేసారి జరగబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఫిబ్రవరి జరగాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఏప్రిల్ కు మార్చబడింది. మరోవైపు మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుంది.
This year, IPL and PSL will run concurrently for the first time ever, and the SA allrounder, who was picked by Peshawar Zalmi in January, signed with Mumbai Indians in March
— ESPNcricinfo (@ESPNcricinfo) March 16, 2025
Read more 👉 https://t.co/d80Vf2KcXy pic.twitter.com/TxA7lDp0Fv