సీఎం రేవంత్‌‌‌‌ను అభినందించిన పీసీసీ కార్యవర్గం

సీఎం రేవంత్‌‌‌‌ను అభినందించిన పీసీసీ కార్యవర్గం
  • పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ 8 సీట్లు గెలవడంపై హర్షం

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ కార్యవర్గం అభినందించింది. బుధవారం హైదరాబాద్‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌లోని రేవంత్ నివాసానికి వెళ్లిన పీసీసీ నేతలు ఆయనను శాలువాతో సన్మానించారు. గతంలో తెలంగాణలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్.

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై పీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, పార్టీ నేతలు ఫహీం ఖురేషీ, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.