ఛాలెంజ్.. టీఆర్ఎస్ 16 సీట్లు గెలవదు : పీసీసీ

హైదరాబాద్ : రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో మెజారిటీ స్థానాలు గెల్చుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారు. గాంధీ భవన్ లో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థులు, పీసీసీ నేతలు మాట్లాడారు. కాంగ్రెస్ కు అధిక స్థానాలు ఇస్తే రాష్ట్రంలో ఉన్న భారీ నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అవకాశవాదులే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని.. వాళ్లతో పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీస్ లు ఇస్తామన్నారు. పదవులకు రాజీనామా చేయించి టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని సవాల్ విసిరారు.

ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ…  కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి జానారెడ్డి.

కేసీఆర్ ముఖం చూసి ఓటేయాలని కేటీఆర్ కోరుతున్నారని… ఎంపీ అభ్యర్థులు ఏమైనా డమ్మీలా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి బ్రదర్స్. టీఆర్ఎస్ 16 సీట్లు గెలవదని..ఇది పార్టీ నాయకులకు మేం విసురుతున్న ఛాలెంజ్ అన్నారు.