ప్రజలు, ప్రభుత్వానికి టీసాట్ వారధిగా ఉండాలి : మహేశ్ కుమార్ గౌడ్​

  • టీసాట్ ఆఫీసును సందర్శించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: టీసాట్​ఆఫీసును పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్ సందర్శించారు. సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి ఆహ్వానం మేరకు శనివారం ఆయన టీసాట్ ఆఫీసును పరిశీలించారు. సీఈవోతో కలిసి వివిధ విభాగాలను పరిశీలించారు. టీసాట్​లో నిర్వహించే కార్యక్రమాలను ఆరా తీశారు. 

సంక్షేమ పథకాల అమలులో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా టీసాట్​నిలవాలని మహేశ్​కుమార్​గౌడ్​ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, అనంతరం మహేశ్​కుమార్ గౌడ్​ను ఆయన సత్కరించారు.