హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లతో బీజేపీ.. దళిత వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆ పార్టీ కుట్రపూరితంగానే దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. రాహుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షితో గాంధీభవన్‌లో సోమవారం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారు. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడ్తున్నరు.
అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నరు. తర్వాత కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇస్తున్నరు. ఆ వినతిపత్రాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తం. దళితులను అమిత్ షా తీవ్రంగా అవమానించారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ తొలగించే కుట్ర చేస్తున్నది. అమిత్ షా కామెంట్లతో ఇది స్పష్టమవుతున్నది. అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలి’’అని దీపాదాస్ మున్షి డిమాండ్ చేశారు.