
హైదరాబాద్, వెలుగు: నియోజక వర్గాల పునర్విభజనపై ఈ నెల 22న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ఆల్ పార్టీ మీటింగ్‌కు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది.
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నదంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఏర్పాటు చేయనున్న ఈ మీటింగ్‌కు మహేశ్ గౌడ్ హాజరై, కాంగ్రెస్ తరఫున తన వాణిని వినిపించనున్నారు.