హైదరాబాద్: ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఎమ్మె ల్యేలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్టానం నిర్ణయమని తెలిపారు. దీని వల్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిళ్లలే దని స్పష్టం చేశారు.
గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ 'ధరణి పోర్టల్ సమస్యల పుట్ట. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నాం. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్, హరీశ్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారు. అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను ఎస్ఐసీ కి అప్పగించాం. అందులోని లోపాలు సవరి స్తం' అని తెలిపారు.
ALSO READ | క్వాలిటీ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారు?..కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
హత్య రాజకీయాలకు స్థానం లేదు. జగిత్యాలలో గంగారెడ్డి హత్య చాలా దుర దృష్టకరమని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేసిన ఆయన వ్యక్తిగతం అని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. 'పార్టీ నిర్ణయం ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. హత్య రాజకీయాలకు తెలంగా ణలో స్థానం లేదు. ఏ పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్థం ఉండాలి. మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకో వాలనుకోవడం అవివేకం. ముఖ్య మంత్రికి సంపూర్ణ మద్దతు ఉంది.. మీరెవరు సీఎంను దింపేందుకు అని మాట్లాడటానికి? మూసీపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం 18 నెలలు గడువు వచ్చింది. కానీ మూసీ ప్రాజెక్ట్ కు రూ.1.5 లక్షల కోట్లు అవుతాయంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంలో అర్థం లేదు' అని అన్నారు.