- గాంధీ భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే మూడేండ్లలో క్రైస్తవ భవన్ ను నిర్మిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో పీసీసీ ఎస్సీ, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో క్రైస్తవులు కాంగ్రెస్ కు అండగా నిలిచారని తెలిపారు. అన్ని మతాలను అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ లో మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ జేడీ శీలం, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.