- అధ్యక్షత వహించనున్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కులగణనపై కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు ఈ నెల 30న గాంధీభవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్కు మంత్రులు, విప్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. కులగణనను విజయవంతం చేసేం దుకు పార్టీపరంగా ఎలాంటి కార్యా చరణను అమలు చేయాలనే దానిపై చర్చించనున్నారు. కులగణనపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, దీన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, పార్టీ పరంగా ఇది ఏ మేరకు ప్రయోజనం గా మారనుందనే దానిపై ఇందులో సమీక్షించనున్నారు.