
గాంధీ కుటుంబం కేసులకు భయపడదన్నారు టీ పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ పలువురు మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ .. దేశలో బీజేపీ ఫాసిస్ట్ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్షసాధింపేనన్నారు. గుజరాత్ లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ భయపడిందన్నారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని అందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీహార్లో ఎన్నికల భయంతో సోనియా,రాహుల్ గాంధీలపై కేసులు పెట్టారని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇపుడున్న బీజేపీ నేతలు ఎవరూ పాల్గొనలేదన్నారు. దేశ ప్రజల గొంతుక రాహుల్ గాంధీ అని అన్నారు మహేశ్ కుమార్ గౌడ్