- బీఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్, హరీశ్ పాట్లని కామెంట్
నిజామాబాద్, వెలుగు: కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిరుద్యోగులను రెచ్చగొడుతూ రోడ్లపై ఆందోళనలు చేయడం అర్థరహితమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారం కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ ఉనికి కోసం అభ్యర్థులను రెచ్చగొడు తున్నరని విమర్శించారు.
ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్న ప్రధాని మోదీ దారుణంగా మోసం చేశారని.. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని.. అభ్యర్థులు, నిరుద్యో గులు వాటి ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం నిజామాబాద్‌లో నుడా చైర్మన్‌గా అపాయింటైన కేశ వేణు ప్రమాణ స్వీకరణ సభలో ఆయన ప్రసంగించారు.
పీసీసీ చీఫ్‌గా ప్రభుత్వం నుంచి అన్నీ క్లారిటీలు తీసుకున్నాకే చెబుతున్న.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన గ్రూప్1 అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురికావద్దు. ఎగ్జామ్‌లో పొందిన మెరిట్ మార్కుల ప్రకారమే ఉద్యోగాల కేటాయింపు జరుగుతుంది. కొంత తక్కువ మార్కులు వచ్చిన వారిని రిజర్వేషన్ కేటగిరిలో చేరుస్తం. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవాలె. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం’’ అని మహేశ్ గౌడ్ అన్నారు. రాజకీయాలు తమిళనాడు తరహా ఉండాలని, అక్కడ పార్టీలు రాజకీయాలను ఎలక్షన్స్ వరకే పరిమితం చేస్తాయని.. తరువాత డెవలెప్మెంట్పై ఫోకస్ చేస్తాయని మహేశ్‌గౌడ్ అన్నారు.