వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం పక్కా అని అన్నారు. అంకుఠిత దీక్షతో రాహుల్ బడుగు బలహీనవర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. తాను రాహుల్ గాంధీ వదిలిన బాణమని, సోనియా, ఖర్గేల సందేశాన్నని అన్నారు. పదేండ్లు బిసిలను అణగదొక్కిన బిఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కులేదని అన్నారు. స్థానిక సంస్థల్లో బిసిల వాటా ఇవ్వలేదని, దమ్ముంటే బిఆర్ఎస్ ప్రెసిడెంట్ గా బిసిని చేయలేని సవాల్ విసిరారు.

చక్కగా పనిచేసే బండి సంజయ్ ని ప్రెసిడెంట్ పోస్ట్ నుండి తప్పించారని, బీసీ నేత బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వకుండా సహాయ మంత్రి ఇస్తారా అని ప్రశ్నించారు. బీసీల విషయంలో రేవంత్ కమిట్మెంట్ గా వున్నారని అన్నారు.కాంగ్రెస్ మూలసూత్రం కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడమేనని అన్నారు.

Also Read :- ఇండియన్ కబడ్డీ క్రీడాకారిణి ప్రీతి ఆత్మహత్య కేసులో భర్తకు 9 ఏళ్ల జైలు

సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ లో ప్రతిఒక్కరు రాహుల్ సైనికులమేనని స్పష్టం చేశారు. బిసీ కులగణన జరగనిదే స్థానిక సంస్థల ఎన్నికలకు పోకూడదని అనుకున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ దూరదృష్టి ఉన్న నాయకుడని, ఆయనతో కలిసిపనిచేస్తామని అన్నారు. పీసీసీ ఎంపిక విషయంలో పొన్నం, సీతక్కల పేర్లు కూడా వచ్చాయని, కానీ వారిద్దరూ తన పేరు చెప్పడం సంతోషమని అన్నారు.

ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెడ్తే గగ్గోలు పెడుతున్నారని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి  రావడం కల అని అన్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బిజెపి, బిఆర్ఎస్ మాటలు ఎవరు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని అన్నారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఐదేండ్లపాలన ఉంటుందని అన్నారు. 

కులాన్ని పక్కన పెట్టి బీసీలుగా ఐక్యం అవ్వాలని, బీసీలుగా ఎదగాలంటే కులాన్ని పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లు అడిగే పార్టీ అని అన్నారు. బిఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయం చేస్తుందని,ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని అన్నారు.