- మహేశ్వర్ రెడ్డిపై పీసీసీ చీఫ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా బీసీ నేత సంజయ్ ఉంటే ఆయన్ని తొలగించి ఓసీకి పదవి ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ సీఎం అని ప్రచారం చేసి ఎల్పీ లీడర్ పదవి ఓసీకి ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ దేశం మెచ్చిన నేతని, ఆయనది ఏ కులమని అడగటం బాధాకరమని తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో ఈరాహుల్.. దేశ వ్యాప్తంగా కులగణన అంశాన్ని తీసుకొచ్చారని మహేశ్ కుమార్ వెల్లడించారు.