ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ సొరంగ ప్రమాదం విచారకరం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ సొరంగ ప్రమాదం విచారకరం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • కార్మికులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటాం : పీసీసీ చీఫ్​  

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌‌‌బీసీ సొరంగ ప్రమాదంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారని శనివారం హైదరాబాద్ లో మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఇతర అధికారులు స్పాట్ కు వెళ్లి అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.