- జిల్లాల వారీగా సమీక్షలు
- నేతల మధ్య గ్యాప్ పై చర్చ
- వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నేతలతో భేటీ పూర్తి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన కార్యాచరణ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమవేశానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలను ఆహ్వానించి సమీక్ష చేస్తున్నారు. చిన్న చిన్న గ్యాప్ లు ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఈ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి కూడా పాల్గొంటున్నారు.
ALSO READ : జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి విషయాన్ని కాంక్రీట్ గా చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీకి పోలైన ఓట్ల శాతం.. ఎంపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై మహేశ్ కుమార్ గౌడ్ ఆరా తీస్తున్నారు. మంత్రులు సొంత పార్టీ కేడర్ కు టైం ఇవ్వాలని, వాళ్ల కష్ట సుఖాల్లో భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలో చేరిన కొత్త నేతలు, పాత నేతల మధ్య మనస్పర్థలు లేకుండా కలిసి మెలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు