సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ విందు

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ విందు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా  సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విందు ఇచ్చారు. బంజారా హిల్స్ లోని తాజ్ దక్కన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  ప్రజలకు అందుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలపై  నేతలంతా సంతృప్తి వ్యక్తం చేశారు.