కులగణన ఆధారంగానే స్థానిక టికెట్లు :  పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్

  • ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్​దే: పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్
  • అసెంబ్లీ సమావేశాల తర్వాతనే కేబినెట్ విస్తరణ
  • మరో రెండు వారాల్లో పీసీసీ కార్యవర్గం 
  • బీఆర్ఎస్, బీజేపీలో ప్రెసిడెంట్ పోస్టు కోసం కొట్టుకుంటున్నరని విమర్శ

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలోనే లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆపీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి సిఫారసులకు తావులేకుండా, ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులను, కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

పార్టీలో పదవు లు కావాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నా.. నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ చుట్టూ, నాయకుల చుట్టూ తిరగడం మానేసి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా.. ప్రజల మధ్యన ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కులగణన సర్వే ప్రకారమే ఉంటుందన్నారు. పార్టీ పదవుల్లో, ఇతర నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుందని అన్ని సామాజిక వర్గాల వారికి, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 80 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.

నియోజకవర్గాల్లో పర్యటిస్త

 పార్టీ గెలుపు కోసం, కార్యకర్తల్లో జోష్ తెచ్చేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని మహేశ్ గౌడ్ అన్నా రు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంక్రాంతి తర్వాత బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఇవి ఉగాది వరకు కొనసాగుతాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర అనుబంధ విభాగాలను కూడా త్వరలోనే ప్రక్షాళన చేసి వాటిని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాతం లౌకిక వాదం.. అన్ని కులా లు, మతాలను గౌరవిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాన్ని, మతాన్ని కించపరచదని, ఏ నాయకుడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అతను ఏ స్థాయిలో ఉన్నా పార్టీ ఊపేక్షించదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించారు.

విధ్వంసం నుంచి పునర్వికాసం వైపు

అసెంబ్లీ సమావేశాల తర్వాతనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని పీ సీసీ చీఫ్ మహేశ్​ గౌడ్ అన్నారు. రానున్న రెండు వారాల్లో పీసీసీ కార్యవ ర్గాన్ని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో పదేండ్ల విధ్వంస పాలన నుంచి పునర్వికాసం వైపు పయనిస్తు న్నదని, ప్రజా సంక్షేమం, అభి వృద్ధి లక్ష్యంగా రేవంత్, భట్టి, మంత్రులు పాలన సాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో నిరు ద్యోగ శాతం తగ్గుముఖం పట్టిందని కేంద్ర గణాంక శాఖ సర్వే లేబర్ ఫోర్స్ రిపొర్టు చెపు తుందని వివరించా రు.

2023 లో 22.9 శాతం నిరుద్యోగం ఉంటే 2024 లో  దాని శాతం18.1 కి తగ్గుముఖం పట్టిందన్నారు. దేశంలో జీఎస్డీపీ ( రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి ) లో తెలంగాణ టాప్​లో ఉంద న్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష కుర్చీ కోసం బీజేపీ, బీఆర్ఎస్​లో అంతర్గత పోరు సాగుతు న్నదని ఆరోపించారు. బీజేపీలో ఎవడిగోల వాడిదే అనే రీతిలో ఉంటే, బీఆర్ఎస్ లో మూడు ముక్కలా ట సాగుతోంద న్నారు. అన్న కేటీఆర్​ను తప్పించి కుర్చీ ఎక్కేందు కు కవిత తహతహలాడుతోంద ని, అదను కోసం హరీశ్ రావు ఎదురుచూస్తు న్నారని పేర్కొన్నారు.