బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం..సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టాలె : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం..సోషల్ మీడియా వేదికగా  తిప్పి కొట్టాలె : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ ఛైర్మన్లకు పిలుపునిచ్చారు.  ఇవాళ గాంధీభవన్ లో ఆయన కార్పొరేషన్ల చై ర్మన్లతో సమావేశం నిర్వహించారు. అనేక వడ పోతలు, ఈక్వేషన్లు ప్రాతిపదికగా తీసుకుంటే మీకు పదవులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కార్పొరేషన్ చైర్మన్ల పాత్ర ఎంతో ఉందన్నారు. నియంత కేసీఆర్ ను గద్దె దించడానికి అంతా శక్తివంచన లేకుండా పనిచేశారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసు కెళ్లడంలోనూ కొనసాగించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నారని, ఆరు గ్యారెంటీల ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చరిత్రాత్మకమని ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. డిజిటల్ మెంబర్షిప్ లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ప్రభుత్వం పట్ల, సీఎం పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మెయిస్ స్ట్రీమ్ మీడియా ప్లాట్ ఫాం ను కూడా విస్తృతంగా వినియోగించు కోవాలన్నారు. 

అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో మహిళలకు ఉచిత బస్సు, 200 లోపు యూనిట్ల వారికి ఉచిత కరెంటు, రూ.500 కే గ్యాస్ కనెక్షన్, ఉద్యోగాల భర్తీ, స్పోర్ట్స్ పర్సిటీ, స్కిల్ వర్సిటీ, విదేశాల నుంచి పెట్టుబడులు ఇంకా ఎన్నో వచ్చాయని, వీట న్నింటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయ త్నించాలని అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళ నపై బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని దీనిని వివిధ ప్రచార వేదికల నుంచి తిప్పికొట్టాలని అన్నారు.