- బీజేపీ కుట్రల నుంచి రాజ్యాంగ రక్షణకు పాదయాత్రలు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఏడాదిపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ క్యాడర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా, అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్లకు నిరస నగా ఈ నిరస నలు చేపట్టాలని సూచించారు.
ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సిటీలు, పట్టణాలు, పల్లెల్లో “సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర”ను నిర్వహించాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వంటి పేర్లతో ర్యాలీలు, యాత్రలు చేపట్టాలని ఆయన లేఖలో కోరారు.