- ఆయనపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మహేశ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్భందాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పై పోరాటం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డిపై వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రచించిన ‘‘ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి”అనే పుస్తకాన్ని శుక్రవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన నేత రేవంత్ అని కితాబిచ్చారు. రాజకీయాల్లోకి చిన్న వయస్సులోనే ఎంట్రీ ఇచ్చి సీఎం స్థాయికి ఎదిగారని రేవంత్ ను అభినందించారు. ఇలాంటి నేతపై పుస్తకాన్ని రాసిన రచయితలను మహేశ్ గౌడ్ మెచ్చుకున్నారు.