![తిరుమలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్](https://static.v6velugu.com/uploads/2024/10/pcc-chief-mahesh-kumar-goud-reached-tirumala_vX0u6ZN8GO.jpg)
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఆయన రాత్రి తిరుమలలో బస చేసి, మంగళవారం తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం లోపు తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.