తెలంగాణలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

తెలంగాణలో  రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్


బీఆర్ఎస్ హయంలో అధికార దుర్వినియోగం చేసిన వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. అక్టోబర్ 24న  గాంధీభవన్లో  ఆయన మాట్లాడారు.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను నిలువున మోసం చేశారని కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే శాంపిల్గా దళితబంధు, రైతుబంధు ఇచ్చి ఓట్లు దండుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ‘కేంద్రం నల్ల చట్టాలను తెచ్చి వ్యతిరేకించిన రైతులను ఇష్టం వచ్చిన్నట్లు కోట్టారు. అప్పుడు బీఆర్ఎస్  పోరు బాట ఎందుకు చేయలేదు. ఎందుకు బీజేపీని ప్రశ్నించలేదు. కేటీఆర్ కు సీఎం కుర్చి గురించి మాట్లాడేందుకు అర్హత లేదు. 

ALSO READ | గుజరాత్కో నీతి, తెలంగాణకో నీతా: బీజేపీపై కేటీఆర్ ఫైర్

డీపీఆర్ కి ఇచ్చిన రూ. 140 కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా మూసీకి ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్షాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా పది నెలల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా సోషల్ మీడియా ప్రజాస్వామ్య యుతంగా నడుస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా అప్రజాస్వామ్యంగా నడుస్తుంది. కేటీఆర్ బయటి దేశాల నుంచి సోషల్మీడియాకు కోట్లను ఖర్చు పెట్టి నడిపిస్తుండు. మూసీ, హైడ్రాపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. డబ్బుల కోసమే ప్రాజెక్టులు కట్టి డబ్బులు దండుకున్నవారే మూసీపై ప్రజలను మభ్యపెడుతున్నారు. కేటీఆర్ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. పదేండ్ల బీఆ ర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజాపాలన కొ నసాగిస్తున్నం. హైదరాబాద్ బాగును కోరుకునే వారు మూసీ ప్రక్షాళనకు అడ్డుకోరు. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించాలి. మూసీ ప్రక్షా ళనకు సహకరించాలి' అని పీసీసీ చీఫ్ అన్నారు.