
- వామపక్షాలు, టీజేఎస్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ లేఖ
హైదరాబాద్, వెలుగు : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం లేఖలు రాశారు. బీజేపీ మతతత్వ పాలనకు, బీఆర్ఎస్ నియంతృత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావుకు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీని గెలిపించాలని మహేశ్ గౌడ్ కోరారు.