కేటీఆర్కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు: టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేటీఆర్కు బీసీల గురించి  మాట్లాడే అర్హత లేదు: టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ఎలాంటి ఆధారాలు లేకుండా  కులగణనపై  కేటీఆర్  దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కులగణన పారదర్శకంగా జరిగిందన్నారు.  కాంగ్రెస్  ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని  ఓర్వలేకనే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.  కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదన్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్..ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. 

బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు మహేశ్ కుమార్ గౌడ్.  కులగణనలో పాల్గొనని కేటీఆర్..రీ సర్వే గురించి అడిగే అర్హత లేదన్నారు. పదేండ్లలో బీసీలకు తీరని అన్యాయం చేసి..ఇపుడు బలహీన వర్గాల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బీసీల గురించి కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు పీసీసీ చీఫ్.

ALSO READ | ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: మంత్రి సీతక్క

కులగణన సర్వే తప్పుల తడక,చిత్తు కాగితం లాంటిదని కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే..బీసీలను తగ్గించి చూపారని..  రీ సర్వే చేయాలని..అపుడు తాము కూడా సర్వేలో పాల్గొని వివరాలు ఇస్తామని చెప్పారు కేటీఆర్. త్వరలో కామారెడ్డిలో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.