హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సమగ్ర కుల గణన సర్వేను పార్టీ కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్సూచించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇవాళ పీసీసీ చీఫ్లేఖను విడుదల చేశారు. కులగణన సర్వేలో ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొని అధికారులకు సహకరించాలని ఆయన ఆదేశించారు. దీనిపై గాంధీభవన్‌లో కనెక్ట్సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రోజువారీగా పార్టీ కార్యకర్తలతో ఈ సెంటర్‌నుంచి ఫోన్లో మాట్లాడుతామన్నారు. సర్వే నిర్వహణలో కార్యకర్తలకు ఏమైనా డౌట్స్ఉంటే కనెక్ట్సెంటర్తో మాట్లాడవచ్చన్నారు.
ALSO READ | మీ బంధువులు, స్నేహితులకు చెప్పండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన చేసి, జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని హమీ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ గాంధీయన్ నాలెడ్జ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి కుల గణన, సామాజిక న్యాయంపై దిశా నిర్ధేశం చేశారని గుర్తు చేశారు. ఈ విషయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు చేసే ఫేక్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టుతున్న కులగణన దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ అన్నారు