కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు

సీఎం కేసీఆర్ అనే వ్యక్తి మోడీ కోవర్ట్ అని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .యూపీఏ భాగస్వాములను చీల్చడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో ప్రత్యేక భేటీ సందర్భంగా మాట్లాడిన రేవంత్ ..పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని కోమటిరెడ్డిని కోరారు.   మోడీ ఆదేశాల మేరకే కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను బలహీనం చేయడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రధాన మోడీ సుఫారీ గ్యాంగ్ లో కేసీఆర్ సభ్యుడన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ గందరగోళం చెందొద్దన్నారు. కేసీఆర్ తో టీఆర్ఎస్ అనేవి ఏ రోజు కలిసే ప్రసక్తే లేదన్నారు. అలాంటి ఆలోచనే లేదన్నారు. కేవలం ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు రేవంత్.

ధనిక రాష్ట్రమన్న సీఎం ధాన్యం కొనలేడా అని ప్రశ్నించారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ తో భేటీ సందర్భంగా మాట్లాడిన కోమటి రెడ్డి..  మూడు నియోజవర్గాలే రాష్ట్రమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుంటామన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ కు నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయన్నారు. తెలంగాణ వ్యతిరేకి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మూడు డీఎస్సీలు ప్రకటించాడని..కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం తన పుట్టిన రోజునాడైనా కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కోరారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ 

థియేటర్స్ లో కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు