వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 90 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది కేసీఆర్ ఫ్యామిలీ రిచ్ అయింది తప్పా నిరుద్యోగుల జీవితాలు మారలేదని విమర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరగబోయే నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ వస్తారని.. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్.
50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు రేవంత్. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లు బజార్ లో దొరుకుతున్నాయన్నారు. టీఎస్ పీఎస్ సీ దొంగల్ని కాంగ్రెస్ పట్టుకుందని.. టీఎస్ పీఎస్ సీ నిందితులను పట్టుకున్నామని ప్రభుత్వం చెబితే రబ్బర్ చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. ఇన్ని కేసుల్లో ఇంకొక కేసు నమోదవుతుందన్నారు. ఇప్పటికే కేసీఆర్ తనపై 135 కేసులు పెట్టారని చెప్పారు.
ఖమ్మంలో ప్రశ్నించే పౌరులపై ఒంటి కన్ను శివరాసన్ కేసులు పెడుతున్నాడని ఆరోపించారు. ఖమ్మం కార్పొరేటర్ భర్త ముస్తఫాపై అన్యాయంగా పీడి యాక్ట్ పెట్టారని అన్నారు. ఈ సారి ఖమ్మంలో పదికి పది స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు.