కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతీ బూత్ లో మెజారిటీ సభ్యత్వం నమోదు చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు రేవంత్.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక డివిజన్లో మీరు చెప్పిన వారికే పథకాలు అమలు చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు, పించన్లు ఇస్తామన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలకు వెళ్తాడన్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవడానికి కేసీఆర్ అన్ని రెడీ చేసుకుంటున్నాడన్నారు రేవంత్.
మరిన్ని వార్తల కోసం..