మరోసారి కేటీఆర్ ట్వీట్ పై రేవంత్ రెడ్డి ఫైర్ 

మరోసారి కేటీఆర్ ట్వీట్ పై రేవంత్ రెడ్డి ఫైర్ 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు. ‘చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి. తెలంగాణ ఉద్యమం సకల జనులది. సాగర్ హారం ఆ జనుల తరపున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. నాడు ఉద్యమంపై.. నేడు రాష్ట్రంపై పడి బతకడం మీకు అలవాటైపోయింది’ అంటూ ట్వీట్ చేశారు. 

అంతకుముందు మంత్రి కేటీఆర్ ‘సాగరహారం ఉద్యమం’ పై ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ' అని నినదించిన రోజు. ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?’ అని ట్వీట్ చేశారు.