సచివాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్, నిబంధనలు పాటించలేదు : రేవంత్ రెడ్డి

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘‘నూతన సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ.. ఎక్కడ కూడా తెలంగాణ CMO ప్రోటోకాల్, నిబంధనలను పాటించలేదు’’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గుదేల్చి.. దోషులను కఠినంగా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.