డ్రామా స్టార్ట్.. ముందు బండి సంజయ్ అరెస్ట్, తర్వాత కస్టడీలోకి నడ్డా

తెలంగాణలో టీఆర్ఎస్,బీజేపీ డ్రామా స్టార్ట్ అయ్యిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.   డ్రామా పార్ట్ 1లో భాగంగా.. బండి సంజయ్ అరెస్ట్ చేశారని.. పార్ట్ 2లో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను  కస్టడీలోకి తీసుకుంటారన్నారు. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించడానికే ఇదంతా? అని ట్వీట్ చేశారు రేవంత్. టీఆర్ఎస్, బీజేపీ బాగోతాన్ని బహిర్గతం చేసామని..ఇప్పుడు డ్రామా ఎలా జరుగుతుందో చూద్దామన్నారు రేవంత్.

కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా జేపీ నడ్డా ఇవాళ సికింద్రాబాద్ లో  ర్యాలీ తీయనున్నారు.