బీఆర్ఎస్ హయాంలోజీపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్​లో స్కామ్..విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్, పొన్నంకు వినతి

బీఆర్ఎస్ హయాంలోజీపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్​లో స్కామ్..విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్, పొన్నంకు వినతి

బషీర్​బాగ్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల రెగ్యులైజేషన్ విషయంలో స్కామ్ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగులు కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2014 లో గ్రామ పంచాయతీలో 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, 2015లో తమను రెగ్యులర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే, కొంతమంది మాత్రమే రెగ్యులర్ అయ్యారని,  మిగిలిన వారి పేర్లకు బదులు వేరే వాళ్లు రెగ్యులర్ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. దానిని కప్పిపుచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జీవో 51 ను తీసుకొచ్చి తమకు అన్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం లో జరిగిన స్కామ్ ను సీఎం దృష్టికి తీసుకెళ్లి  సిట్ వేసి విచారణ జరిపించాలని కోరారు.