కేటీఆర్ ..నీ పొలిటికల్ డ్రామాలు ఆపు : అద్దంకి దయాకర్

కేటీఆర్ ..నీ పొలిటికల్ డ్రామాలు ఆపు : అద్దంకి దయాకర్
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి  అద్దంకి దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: 'కేటీఆర్..నీ పొలిటికల్ డ్రామాలు ఇప్పటికైనా ఆపు' అని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. లగచర్లలో అధికారుల మీద మీరే(బీఆర్ఎస్) దాడులు చేయించి పరువు పోగొట్టుకున్న తర్వాత, ఇప్పుడు రైతుల పేరు మీద పరామర్శలు ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం ఏ రైతుపై కూడా కేసు పెట్టలేదని తెలిపారు. అధికారులపై దాడులు చేసిన రౌడీ మూకలపై మాత్రమే కేసులు పెట్టామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోసం ఇంతగా దిగజారడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు.