- పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్అసెంబ్లీకి రాకపోతే అతనికి అపొజిషన్ పదవి ఎందుకని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఉనికి రాష్ట్రంలో లేనే లేదని అన్నారు. గురువారం గాంధీ భవన్లో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయంలో ఉందని.. కానీ, మెజారిటీ ప్రజలు బతుకమ్మ ఆడరని చెప్పారు.
పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా పెట్టలేకపోయారని ప్రశ్నించారు.అనంతరం ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతంను అధికారికంగా ప్రకటించామన్నారు. పదేండ్లు పాలించిన వాళ్లు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఫైర్ అయ్యారు.