సంధ్య థియేటర్ ఘటనలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? : అద్దంకి దయాకర్

సంధ్య థియేటర్ ఘటనలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? : అద్దంకి దయాకర్
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో తెలపాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్​ని అరెస్టు చేస్తే బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వెనుక రాజకీయ పార్టీలు ఉన్నట్టు అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్​కు సపోర్ట్ చేసినట్టు బాధిత కుటుంబానికి చేయట్లేదని, తెలంగాణ సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తూ కొందరు కుట్రలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాళ్ల కుట్రలకు అల్లు అర్జున్ బలిపశువు కావొద్దని, రాజకీయాల కోసం సీఎంను, ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని కోరారు.