రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ శకటం .. దీపాదాస్ మున్షీ జెండా ఊపి లాంచ్

రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ శకటం .. దీపాదాస్ మున్షీ జెండా ఊపి లాంచ్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక శకటాన్ని పీసీసీ రూపొందించింది. దాన్ని శనివారం కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ దీప్ దాస్ మున్షీ  గాంధీ భవన్ లో  ప్రారంభించారు. గతంలో సోనియా గాంధీని కేసీఆర్ పొగిడిన మాటలను ఈ శకటంలో ఏర్పాటు చేశారు. “సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ రాష్ర్టం సాకారమైంది. 

ఈ అంశంలో ఎవరికి డౌటే అవసరం లేదు.” అని తొలి అసెంబ్లీ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ మాటలను శకటం ద్వారా  ప్రజలకు వినిపించేలా అందులో  మైక్ లను సెట్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫిషర్​మెన్ సెల్ నేత మెట్టు సాయికుమార్​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.