నాదర్​గుల్ భూములపై తప్పుడు వార్తలు: సామ రామ్మోహన్ రెడ్డి

నాదర్​గుల్ భూములపై తప్పుడు వార్తలు: సామ రామ్మోహన్ రెడ్డి
  • పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నాదర్​గుల్  భూములపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, 3 వందల ఎకరాలకు ఎసరు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

 కాంగ్రెస్​ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నదని తెలిపారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు.  సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన మీడియా గొంతు వినిపిస్తుందని, కానీ.. కొందరు మీడియా ఖ్యాతిని తగ్గించేలా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.