
- పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి
జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే నియోజకవర్గంలోనే బట్టలు ఊడదీసి కొడతామని పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆదివారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే బీఆర్‌ఎస్ లీడర్లు తట్టుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా దళిత వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే హర్షించాల్సింది పోయి.. ఆయనను జగదీశ్‌రెడ్డి కించపరచడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. సీఎం పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అలాంటి మాటలు తగ్గించుకోకపోతే నియోజకవర్గంలో తిరగలేడని హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరుశరాములు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సత్తి రెడ్డి, రామారావు, దిడ్డి రాము, రామకృష్ణ, దీక్షిత్ గౌడ్, సూర్య, ముద్దమల్ల రవి, రజిత, స్వప్న, మానస, శ్రీను, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.