
- పీసీసీ మైనార్టీ సెల్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 13న పీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఛలో ట్యాంక్ బండ్‌కు పిలుపునిచ్చినట్లు రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ వెల్లడించారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించనున్న ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో మైనార్టీలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మైనార్టీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. చట్టాల సవరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ అవి రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు. ఉన్న మైనార్టీల సంపదను కొల్లగొట్టేందుకు బీజేపీ వక్ఫ్ బిల్లుకు సవరణ చేసిందని ఆరోపించారు.