డిచ్​పల్లికి మెడికల్​ కాలేజీ మంజూరు చేయిస్తాం : పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్

డిచ్​పల్లికి  మెడికల్​ కాలేజీ మంజూరు చేయిస్తాం : పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్
  • పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్ 

డిచ్​పల్లి, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి తో మాట్లాడి డిచ్​పల్లికి మెడికల్​కాలేజీ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.  అన్ని పత్రాలతో  సీఎస్ఐ  ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని సూచించారు. డిచ్​పల్లి సీఎంసీ కాంపౌడ్ లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో కలిసి డాక్టర్స్ క్వార్టర్స్ ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్​ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు 200 ఎకరాల్లో సీఎస్​ఐ ఆధ్వర్యంలో డిచ్​పల్లి వద్ద హాస్పిటల్​ ఏర్పాటు చేశారన్నారు.  2003 నుంచి 2008 వరకు ఇక్కడ మెడికల్​ కాలేజీ నడిచిందని గుర్తు చేశారు. త్వరలో ఇక్కడ నర్సింగ్​కాలేజీ ఏర్పాటు కానుండడం మంచి విషయమన్నారు.  ప్రభుత్వంతో చర్చించి 2025 లో మెడికల్​ కాలేజీ పున: ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం

కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్​ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. గతంలో నిజామాబాద్​ జిల్లా ధనాగారంగా ఉండేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతి పెద్దదని, దానిని గత ప్రభుత్వం తెరిపించలేదని విమర్శించారు. నిజాం సాగర్​ ఆయకట్టు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. 

 గత ప్రభుత్వ పాలనలో జిల్లా వెనుకబాటుకు  గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం సీఎస్​ఐ ప్రతినిధులు పీసీసీ చీఫ్ ను ఘనంగా సన్మానించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్​తాహెర్​బిన్​ హందాన్​, తెలంగాణ కోఆపరేటీవ్​యూనియన్​లిమిటెడ్​ చైర్మన్​మానాల మోహన్​ రెడ్డి, ఏఎంసీ చైర్మన్​మొప్ప గంగారెడ్డి, బిషప్​ రూబెన్​మార్క్, మండల అధ్యక్షుడు అమృతాపూర్​గంగాధర్, శాంసన్​తదితరులు పాల్గొన్నారు.