మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : పున్న కైలాస్​

  •     పీసీసీ కార్యదర్శి పున్న కైలాస్​

మిర్యాలగూడ, వెలుగు : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పీసీసీ కార్యదర్శి పున్న కైలాస్​ కోరారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహాక సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, తీన్మార్ మల్లన్న టీమ్ మెంబర్ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల తరఫున తన గళం వినిపించారన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీశారని చెప్పారు. మల్లన్నపై ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు పోరాటం ఆపలేదన్నారు. సమావేశంలో కిసాన్ సెల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్

తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి  గంధం రామకృష్ణ, ఘని, జావెద్, లావూరి రవి నాయక్, నాగలక్ష్మి,  పందిరి అనిత, ఎంపీటీసీల జిల్లా పోరం ఉపాధ్యక్షుడు బెజ్జం సాయి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.