హైదరాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించిన అమరుల స్థూపం వద్ద కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూకు పర్మిషన్ ఎలాఇచ్చారని పీసీసీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ నిరంజన్ ప్రశ్నించారు. కొత్త సచివాలయం, అంబేద్కర్విగ్రహం కనిపించేలా ఇంటర్వ్యూ షూట్ చేశారని తెలిపారు.
గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. అమరుల స్థూపం వద్ద ఇంటర్వ్యూకు పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై ఎన్నికల కమిషన్విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్కు గోరటి వెంకన్న తొత్తులా పనిచేస్తున్నారని విమర్శించారు.
ALSO READ: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న .. మన గేమ్ స్ట్రీమింగ్ యాప్స్